నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 07 : పుంగనూరు మండలంలోని కొత్తపల్లె గ్రామసమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం తనిఖీ చేసి 7 మంది జూదర్లును అరెస్ట్ చేశారు.ఎస్‌ఐ అన్సర్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సీఐ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మండలంలోని కొత్తపల్లె గ్రామ సమీపంలోని చెరువులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఏడు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.14,700 నగదు, 7 ద్విచక్రవాహనాలు , 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.
Reporter
Namitha News