నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై స్పెషల్ డ్రైవ్ పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి, వాహనాల రాకపోకలను సుగమం చేసేందుకు, మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో 10 మంది సాయుధ పోలీసులు స్థానిక సిటియం రోడ్డులోని టౌన్ బ్యాంక్ నుండి అంబేడ్కర్ సర్కిల్ వరకు తనిఖీలు చేపట్టారు. రోడ్లపైకి చొచ్చుకొచ్చిన షాపుల బోర్డులను తొలగించి, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకూడదని వ్యాపారస్తులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లైసెన్స్, సరైన పత్రాలు కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. నో-పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపిన వారికి జరిమానా విధించి నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఉంచాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు
Reporter
Namitha News