నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి - ఫిబ్రవరి 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ. స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వి.ఎల్.ఎస్.ఐ (VLSI) టెస్టింగ్ మరియు ఫిజికల్ డిజైన్ రంగాల్లో జరుగుతున్న ఆధునిక సాంకేతికతలు అనే అంశంపై విద్యార్థులకు ఒక్క రోజు సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నానికి చెందిన సిలిక్వాన్ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ అండ్ సి ఈ ఓ డాక్టర్ అష్రఫ్ అలీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వి.ఎల్.ఎస్.ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్) ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీలో ఫిజికల్ డిజైన్ అనగా లాజికల్‌గా రూపొందించిన సర్క్యూట్ నమూనా తయారీను నిజమైన చిప్ (IC) రూపంలో అమలు చేసే ప్రక్రియ అని అన్నారు. ఐసీ తయారీలో నాలుగు ప్రధాన దశలు ఉంటాయని సెమీకండక్టర్ చిప్‌లు (ICలు) తయారు చేయడానికి ఉపయోగించే సిలికాన్ పలకను, వేఫర్ తయారీ, నమూనా తయారీ, పరీక్షించడం వంటి వాటిని వివరించి, రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు వంటి భాగాలను ఒకే చిన్న చిప్‌లో సమగ్రపరచి సిగ్నల్స్‌ను పంపించే విధానాన్ని వివరించారు. అలాగే టెస్టింగ్ విభాగంలో చిప్ పనితీరును పరీక్షించడం, లోపాలను గుర్తించడం, నాణ్యతను నిర్ధారించడం వంటి అంశాలను వివరించారు. వి.ఎల్.ఎస్.ఐ చిప్ తయారీ రంగంలో పరీక్షించడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాధనాలు అయిన సినాప్సిస్ (Synopsys), కాడెన్స్ (Cadence) వంటి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అమెరికా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ మరియు ఇండియా వంటి దేశాల్లో అంతర్జాతీయ సంస్థలు అయిన ఇంటెల్ , క్వాల్కామ్ వంటి కంపెనీలలో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, చిప్ టెస్టింగ్ ఇంజనీర్ మరియు నమూనా తయారీ ఇంజనీర్ వంటి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గౌర్, డాక్టర్ ఎస్ రాజశేఖరన్, కోఆర్డినేటర్ డాక్టర్ జి. నాగజ్యోతి, కో-కోఆర్డినేటర్ జి. చరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News