నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 18 : తంబళ్లపల్లె నుండి కోసువారి పల్లి పంచాయతీ బాపన చెరువు పల్లె వరకు రోడ్డు గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాది క్రితం అప్పటి టిడిపి ఇన్చార్జి జయచంద్ర రెడ్డి రోడ్డు మరమ్మతులకు సహకరించారు. రోడ్డు పూర్తి కావడంతో నేడు పాదచారులు, ప్రజలు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శనివారం జయచంద్ర రెడ్డి తారు రోడ్డున పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు
Reporter
Namitha News