Sunday, 26 July 2026 07:59:03 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కాలేయ వ్యాధి తో దిన దిన గండం గా అపశయ్య పై అమరనాథరెడ్డి

కర్పూర హారతిలా వైద్య ఖర్చు - ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

Date : 18 March 2026 08:09 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : ఓ మధ్యతరగతి రైతుబిడ్డ కొద్దో గొప్పో చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన పాలిట కాలేయ వ్యాధి కాలయముడై ప్రాణాన్ని కబలిస్తున్న దయనీయ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లి పంచాయతీ నల్ల తిమ్మిరెడ్డి గారి పల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు అమరనాథరెడ్డిది ఓ మధ్యతరగతి రైతు కుటుంబం. అమరనాథరెడ్డి చదువు ముగించుకుని బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి తన భార్య పద్మావతి, ఏడేళ్ల చిన్నారితో కె ఆర్ పురం లో ఓ అద్దె ఇంట్లో సంతోషంగా జీవనం సాగించేవారు. ఈ పచ్చటి సంసారం సాగుతుండగా రెండేళ్ల క్రితం అమరనాథ్ రెడ్డికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. అప్పట్లో కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుటపడి యధావిధిగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ కాలం వెలదీస్తుండగా మరో మారు అమర్నాథరెడ్డి పై ప్రకృతి పగబట్టి కాలేయ వ్యాధి రూపంలో దాపురించింది. గత పది రోజులుగా బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సుమారు మూడు లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేక బెంగళూరు సెన్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్సలకు చేర్చారు. కాలేయం పూర్తిగా దెబ్బ తినడంతో అప్పులు చేసి చికిత్సలు చేయించడంతో డబ్బు కర్పూర హారతిలా కరిగిపోతోంది తప్ప ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం అమరనాథరెడ్డిని ఐసీయూలో ఉంచి వారానికి డయాలసిస్ కోసం రెండున్నర నుండి మూడు లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావడంతో ఆ కుటుంబం నిర్గాంతపోయింది. అమర్నాథ్ రెడ్డి దయనీయ స్థితిని చూసి భార్య పద్మావతి, కుటుంబ సభ్యులు ఆ దేవుని మీద భారం వేసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అమరనాథ్ రెడ్డి లివర్ ఆపరేషన్ కోసం ఇంకా 30 లక్షల వరకు అవసరం ఉంటుందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న కూటమి ప్రభుత్వం అమరనాథరెడ్డి వైద్యానికి సహకరించాలని తంబళ్లపల్లె మండల టిడిపి నేతలు కోరుకుంటుండగా మనసున్న మారాజులు ఆదుకుంటారేమోనని అమర్నాథ్ రెడ్డి కుటుంబం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :