నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 08 : పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష చేసిన అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. శ్రీ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 41 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సందర్భంగా గురుస్వామి సుబ్బన్న స్వామి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల దీక్షా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. సుమారుగా నిత్యం వందలాదిమంది స్వాములు ప్రజలు పాల్గొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ వస్తున్నారని ఆయన అన్నారు, అదేవిధంగా భక్తులు మరియు ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి, గురుస్వామి గోవిందు, సుబ్రి, పిచ్చండి, అభినయ రెడ్డి, హరి, రవి అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News