నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 17: అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, సిటిఎం క్రాస్ రోడ్డు సచివాలయం వెనకకు బహిర్భూమికి వెళ్లిన మహిళను ఆగంతకులు గొంతుకు టవల్ బిగించి, ముఖం వాసేల కొట్టి అత్యాచారంకు పాల్పడి, ఆపై హత్య చేసినట్లు తెలిసింది. సీటీఎం క్రాస్ రోడ్డులోని పాకాలవీధికి చెందిన భూమల గడ్డోళ్ల లేట్ అంజి భార్య సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ (40) గా గుర్తించారు. రాత్రి 9.30కి బహిర్భూమికి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. సిటిఎం క్రాస్ రోడ్ లో మహిళను హత్య చేయడానికి పక్కనే బ్రాందీ షాపు ఉందనీ, దీంతో ఎవరైనా ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన మహిళను అడ్డగించి అత్యాచారం చేసే ఆపై చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... మదనపల్లి తాలూకా పోలీసులు సంఘనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు...
Reporter
Namitha News