Sunday, 26 July 2026 05:43:50 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఆసుపత్రి లో సేవాభావంతో పనిచేయాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

సర్వజన ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 29 May 2026 07:06 PM Views : 90

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాభావంతో పనిచేయాలి ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగుల పట్ల సేవాభావంతో సిబ్బంది పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్‌తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 200 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్న ఆసుపత్రిలో రోజుకు 400 మందికి పైగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది గైర్హాజరు కాకుండా విధులను సక్రమంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సార్ షంషీర్, బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మెడికల్ షాపు రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, రెడ్డి రాయల్, చెల్లా, బాలమణి శేఖర్, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్, పసుపులేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: