నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 26 : ఆత్మకూరు పట్టణంలో అభివృద్ధి పథంగా ప్రయాణించేందుకు భవిష్యత్ తరాల అవసరాల కోసం మున్సిపాలిటీ అభివృద్ధికి కీలకమైన జీఏఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ ను పరిశీలించి ప్రభుత్వ ఆమోదం కొరకు పంపించడం జరిగింది.. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బిల్డింగ్ రూల్స్ 2017 చట్టప్రకారం ఇకపై తప్పనిసరిగా ప్రతి ఒక్క అవసరాన్ని ఆమోదించి ప్రారంభించవలసిన అవసరం ఉంటుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా పట్టణంలోని అన్ని వైపుల నుండి విశాల మన రహదారుల నిర్మాణము మురికినీటి సమస్య లేకుండా ప్రత్యేక సదుపాయము త్రాగునీటి మరియు ఇతర అవసరాలు కూడా వేగవంతంగా సమకూరుతాయి.. ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదం తెలపడంతో వాటికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించవలసిందిగా మంత్రి ఆనం ఆదేశాలు ఇచ్చారు
Reporter
Namitha News