నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 08 : రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ యూనిట్ కో కన్వీనర్ మరియు జనరల్ సెక్రటరీగా పవన్ కుమార్ వీరనాల నియమితులయ్యారు. టిడిపి కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారని పవన్ కుమార్ తెలిపారు. పవన్ మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఐ టి మంత్రి నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్, మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషా, నియోజకవర్గం అబ్సర్వర్ గురుమూర్తి గౌడ్, రాజు మండల అబ్సర్వర్ శ్రీనివాసులు నాయుడు మండల టిడిపి అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ లకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు. పంచాయతీ టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతానన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తానన్నారు.
Reporter
Namitha News