నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 20 : అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ సర్కిల్ కు ఇన్స్పెక్టర్ గా బదిలీ పై వచ్చిన రవి నాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ నేరాలను నియంత్రణ కృషి చేస్తానని , శాంతిభద్రతల విఘాతం కల్పించినా, జూదం, పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. బుధవారం ఉదయం రూరల్ సర్కిల్ సిఐగా మదనపల్లె సర్కిల్ కార్యాలయం లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ సత్యనారాయణ కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లారు. తిరుపతి శ్రీ సిటీలో పనిచేస్తున్న ఎం. రవి నాయక్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలతో మదనపల్లి రూరల్ పి.యస్. కు సాధారణ బదిలీ పై వచ్చారు.
Reporter
Namitha News