Sunday, 26 July 2026 08:10:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయ నూతన ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన టి . వెంకటేశ్వర్లు

Date : 21 March 2026 07:10 AM Views : 381

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 20 : మదనపల్లి లోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యాలయ ప్రిన్సిపాల్ టి . వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 20-03-2026న జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ప్రిన్సిపాల్ జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. తరగతుల ప్రారంభం కోసం అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు), మదనపల్లి ఆవరణలోని తాత్కాలిక భవనంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడ్మిషన్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31-03-2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని పేర్కొన్నారు. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడతాయని తెలిపారు. అడ్మిషన్ గైడ్లైన్స్ మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.kvsangathan.nic.in⁠ను సందర్శించవచ్చు. మొదటి తరగతి దరఖాస్తుల కోసం https://admission.kvs.gov.in/⁠ వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ గారి మొబైల్ నెంబర్ 9441473837 ను సంప్రదించవలసిందిగా కోరారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: