Sunday, 26 July 2026 10:56:16 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 19 April 2026 10:59 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 19 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సి.దినేష్, జయంత్ .ఆర్, పృథ్వినాథ్ రెడ్డి.ఏ, బి.రంజిత్ కుమార్, కార్తీక్ ల విద్యార్థుల బృందం జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం కార్యక్రమంలో మొదటి బహుమతి సాధించి ప్రతిభ కనపరిచినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. తిరుపతిలోని ఎస్.వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం “ఈ-బ్లేజ్" కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్‌లలో శక్తి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు సోలార్ మరియు విండ్ ఎనర్జీ వినియోగంపై రూపొందించిన తమ వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించి, మొదటి బహుమతి మరియు ప్రశంశ పత్రాలను అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలను నిర్వహించడానికి ఈ పరిష్కారం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును డాక్టర్ టి. బాలాజీ మార్గదర్శకత్వంలో విద్యార్థులు రూపొందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, విభాగాధిపతి డాక్టర్ మణివలన్ గుణశేఖరన్, ఏ.వి పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: