నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తనను నమ్మించి, తన వద్ద లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్షల్లో డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ హిజ్రా ఇంజరపు స్వాతి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గౌతమినగర్ లోని డమరేశ్వర్ స్వర్ణలత ఇంటిముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డమరేశ్వర్ స్వర్ణలత ఇంటి సమీపంలో ఉండేదాన్నని, నన్ను నమ్మించి చీటీల వ్యాపారం పేరుతో తన వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బులు తీసుకొని తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన వద్ద తీసుకున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు తమకు న్యాయం చేయలేదని, అందరినీ వారు మేనేజ్ చేసుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మా అక్క 15 నెలలుగా కువైట్ లో సంపాదించిన మొత్తాన్ని వారికే ఇచ్చేశానని పేర్కొంది. గత ఐదు నెలలుగా తనను ఫాలో చేస్తూ, ఎక్కడికి వెళ్లినా అనుసరిస్తూ, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీంతో తాను ఇంటిలోనే ఉండి పోవాల్సి వచ్చిందని, వాళ్ళ వల్ల హౌస్ అరెస్ట్ అయ్యానని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని అయితే ఇంటి నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.ఏది ఏమైనప్పటికీ తాను ముఖ్యమంత్రిని కలుస్తానని, ఈ క్రమంలో తనకు ప్రాణహాని జరిగితే, అందుకు డమరేశ్వర్, స్వర్ణలత దంపతులే బాధ్యులని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు తమ బిడ్డలను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా హిజ్రా ఆవేదనను గుర్తించి ఆమెకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
Admin
Namitha News