Monday, 27 July 2026 10:53:00 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చిన్నమండ్యం మండలంలో రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

హైవే కనెక్టివిటీ రోడ్ల కిరువైపులా చెట్లపొదలు తొలగించాలి

Date : 08 April 2026 07:18 PM Views : 240

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నమండ్యం - ఏప్రిల్ 08: చిన్నమండ్యం మండలంలో రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నమండెం మండలంలో రోడ్డు భద్రత అంశంపై అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి రోడ్డు భద్రత అంశాలను తనిఖీ చేశారు

ఈ సందర్భంగా ఏఏ ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, లైటింగ్, సూచిక బోర్డులు, కూడలల్లో లైటింగ్ సౌకర్యం ఉందా లేదా, హైవేకు కనెక్టివిటీ రహదారిలలో మరియు మలుపులలో రోడ్డు కిరువైపులా చెట్ల పొదలు పెరిగిన అంశాలు తదితరాలను కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపు 40 ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ముఖ్యమైన కూడళ్లలో, మలుపుల వద్ద, స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రాంతంలో సూచిక బోర్డులు, తప్పనిసరిగా లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైవే కనెక్టివిటీ గ్రామీణ రోడ్ల కిరువైపులా చెట్లపొదలు తొలగించాలన్నారు. ఇందుకు సంబంధించి రవాణా, పంచాయతీ, విద్యుత్తు, పోలీసు, ఇతర సంబంధిత శాఖలన్నీ సమన్వయంగా కృషిచేసి ప్రమాదాల రహితంగా రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :