నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టౌన్ బికె.పల్లి మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్.... పవిత్ర శుక్రవారం ప్రతి ముస్లిం మసీదులో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పరోపకారం, దానధర్మాలు సమజ హితం కోసం పాటుపడే విధంగా సన్మార్గంలో నడవడం అల్లాహ్ కు ప్రియమైనదని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం మదననపల్లె టౌన్ బికే.పల్లి 2 వ వార్డు మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ కు స్దానిక ముస్లింలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హజరైన ముస్లింలు నిసార్ అహమ్మద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మతపెద్దలు సాదర స్వాగతం పలికి ప్రార్థనలు చేపట్టారు. ప్రార్థనల అనంతరం నిసార్ అహమ్మద్ స్దానికులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రార్థనలలో హనీఫ్, కరీముల్లా, షంషీర్, హనీఫ్, నూరుల్లా, షఫీ, జాఫర్, బావాజన్, అబిద్, యూనస్, నవాజ్ అలీ ఖాన్, నూర్ మొహిద్దీన్, ఫక్రుద్దీన్, జైనుద్దీన్, నాసిర్, ఇలియాస్, హబీబ్, ఫయాజ్, సత్తార్, రియాజ్, షానవాజ్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News