నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 14 : తంబళ్లపల్లె - మొలకలచెరువు మండలాల సరిహద్దులోని చౌడ సముద్రం వద్దగల ఏరుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ ఏరు భారీ వర్షాల సమయంలో సుమారు ఆరడుగుల లోతు నీటి ప్రవాహం వెళుతుంది. ఈ నీటి ప్రవాహం వలన ఈ రహదారులో రాకపోకలు నిలిచిపోతాయి. విధిలేని పరిస్థితుల్లో పలువురు వాహనాలలో ఏరు దాటడానికి ప్రయత్నించి ప్రమాదాలకు గురయ్యారు. తంబళ్లపల్లె మండలానికి చెందిన గంగిరెడ్డిపల్లి, దిగువపాలెం పంచాయతీలకు చెందిన సుమారు 10 గ్రామాలు ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు జరుగుతాయి. భారీ వర్షం కురిసి ఏరు నీటి ఉధృతి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే చౌడసముద్రం ఏటికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News