నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 16 : రామసముద్రం మండలం దిన్నెపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను రామసముద్రం మండలం సబ్ ఇన్‌స్పెక్టర్ పి. దిలీప్ కుమార్ మరియు రాయచోటి శక్తి టీం నుండి పోలీస్ కానిస్టేబుల్ మణికంఠ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు మహిళలపై నేరాలు (Crime Against Women), సైబర్ క్రైమ్‌పై జాగ్రత్తలు, రోడ్డు భద్రత (Road Safety Awareness), బాల్య వివాహాల నివారణ, మంచి అలవాట్లు అలవర్చుకోవడం, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, హెల్ప్‌లైన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, తప్పుడు సమాచారం, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు సుమారు 250 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంచడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.
Reporter
Namitha News