నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పలమనేరు - నవంబర్ 30 : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం లో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం. వెంకటేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి. వెంకటేశులు భార్య శిల్పకు ఎం. వెంకటేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం అనంతరం ఇద్దరూ పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Namitha News