నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 18 ః తంబళ్లపల్లె గ్రేడ్-1 కార్యదర్శిగా ఎస్ మహబూబ్ బాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గుండుగల్లు గ్రేడ్-2 కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతి పై తంబళ్లపల్లె పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టాడు. తంబళ్లపల్లె పంచాయతీ అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల సహకారంతో కృషి చేస్తానన్నారు. ఆయనను ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీలు ఎంవి ప్రసాద్, మారుతీకుమార్ లు అభినందించి పంచాయతీ ఆదాయ వనరులు పెంపుతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు.కోసువారిపల్లి కార్యదర్శి శ్రీనివాసరావు, సిబ్బంది సోమశేఖర్ రెడ్డి, పద్మావతి, భాస్కర్, మస్తాన్, మనోహర తదితరులు అభినందించి ఘనంగా స్వాగతించారు
Reporter
Namitha News