Monday, 27 July 2026 12:49:10 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు

ముఖ్యఅతిథిగా హాజరైన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి

Date : 31 December 2025 08:08 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్నంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు... ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి... ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్లేకార్డుల ప్రదర్శన.. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, విద్యార్థి,యువత,మహిళలతో కిక్కిరిసిన పుర వీధులు .... మదనపల్లి కేంద్రం గా జిల్లా ఆవిర్భావమైన శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం.షాజహాన్ భాషా ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.స్థానిక పుంగనూరు రోడ్డులోని మిషన్ కాంపౌండ్ నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీకి మదనపల్లె నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,స్వచ్ఛంద సేవా సంస్థలు,ప్రజలు,విద్యార్థులు,మహిళలు,యువత హాజరై పాలుపంచు కున్నారు.దశాబ్దాల కలగా మిగిలిన మదనపల్లి ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున మహిళలు,స్వచ్ఛంద సంస్థలు, తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,ప్రజలతో కలిసి ర్యాలీ ముందుకు సాగింది.ఇందులో భాగంగా మిషన్ కాంపౌండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా వాల్మీకి సర్కిల్,టౌన్ బ్యాంక్ సర్కిల్,అవెన్యూ రోడ్డు,బెంగళూరు బస్టాండు అనిబిసెంట్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ముందుకు సాగింది.ఇందులో భాగంగా అని బిసెంటుకు మదనపల్లి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచ్చేసి,ప్రదర్శనలో భాగస్వాములు కావడం జరిగింది.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ బాషాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని,దశాబ్దాల కల మదనపల్లె జిల్లా కలను నెరవేర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు.చారిత్రాత్మక మదనపల్లె జిల్లా ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమన్నారు.మదనపల్లి,తంబళ్లపల్లి,పీలేరు,పుంగనూరు నియోజకవర్గ వర్గాల ప్రజలకు ఒక పండుగ రోజన్నారు.నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మదనపల్లి జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని ప్రజల తరఫున వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్, ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, ఆర్.జె.వెంకటేష్, సహదేవ నాయుడు, రెడ్డి షంషీర్,రామిశెట్టి కృష్ణ,బొమ్మిశెట్టి పురుషోత్తం,యర్రబల్లి వెంకటరమణారెడ్డి,మోడెం సిద్ధప్ప,రాటకొండ శ్రీనివాస నాయుడు,కొరముట్ల నాగరాజు,రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు తలారి రాధమ్మ, జాఫర్ ఉన్నిసా, విజయమ్మ, భారతి నాయుడు, నవీన్ చౌదరి, హెరిటేజ్ రమేష్ నాయుడు, బీదం గురునాథ్ యాదవ్,జీవి నాయుడు,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,జెసిబి వేణు,బాలమాలి శేఖర్,రెడ్డి రాయల్,మంజునాథ్ , చెల్లా, కె.వి నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, రత్నమయ్య, డాన్స్ రెడ్డి, మల్లికార్జున్ నాయుడు, కత్తి లక్ష్మన్న, బాలు స్వామి, జాన్ బాబు, హరినాథ్, నాగయ్య, బిల్డర్ రామకృష్ణ, కోనా భాస్కర్, సర్పంచ్ మధు, భక్తవత్సలం, రఘుపతి నాయుడు, పెద్దసంఖ్యలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: