నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 : తంబళ్లపల్లి మండలంలో ఎక్కడైనా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉక్కు పాదం మోపుతామని ఏఎస్ ఐ నజీర్ భాష హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో ప్రజలతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి ఆదేశాల మేరకు ఎక్కడైనా గంజాయి, కోడి పందాలు, జూదాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచామని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురిచేసిన ఆకతాయిలకు కఠిన శిక్షలు తప్పవన్నారు. ఎక్కడైనా అ సాంఘిక కార్యక్రమాలు, మహిళల పట్ల వేధింపులు జరిగితే 112 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా స్థానిక ఎస్సై, సర్కిల్ ఇన్స్పెక్టర్, డి.ఎస్.పి కి ఫోన్ చేయాలని వారి ఫోన్ నెంబర్లు రహస్యంగా ఉంచబడతాయని ప్రతి ఒక్కరు శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News