Monday, 27 July 2026 09:51:26 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మాజీ మంత్రి రోజా సైతం SIR ప్రక్రియ లో

వేలావడి పోలింగ్ బూత్‌లలో SIR ప్రక్రియను సమీక్షించిన మాజీ మంత్రి ఆర్.కె రోజా సెల్వమణి

Date : 24 June 2026 07:47 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నగిరి - జూన్ 24 : నగరి రూరల్ మండలం వేలావడి గ్రామ పరిధిలోని 153, 154 పోలింగ్ బూత్‌లలో SIR ప్రక్రియకు సంబంధించిన సమస్యలు, స్థానిక పరిస్థితులు మరియు ఓటర్ల సందేహాలపై మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి ఆర్.కె. రోజా గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ BLAలు, మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బూత్‌ల వారీగా SIR ప్రక్రియ ప్రగతి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవసరమైన పత్రాల వివరాలపై రోజా గారు BLAలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలు, సమస్యలను తెలుసుకున్నారు. SIR దరఖాస్తులను ఏ విధంగా నింపాలి, అవసరమైన వివరాలు, పత్రాలు ఏమిటి, దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేయాలి అనే అంశాలపై ఓటర్లకు, BLAలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. మన పార్టీకి సంబంధించిన ఓటర్లను గుర్తించి, ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి ఆర్.కె. రోజా గారు స్పష్టం చేశారు. SIR దరఖాస్తులలో ఎటువంటి తప్పులు లేకుండా అవసరమైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించాలని BLAలు, నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె వివరంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు సహాయం అవసరమైన ఓటర్లకు ప్రత్యేకంగా సహకారం అందించాలని ఆమె సూచించారు. బూత్‌ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సమాచారం అందిస్తూ, ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని BLAలకు సూచించారు. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ప్రతి సమస్యను నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అబ్జర్వర్, టీం కమిటీ సభ్యులు, BLAలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :