నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి వైసీపీ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష)అధ్యవర్యంలో మదనపల్లి ప్రభుత్వాసుపత్రి పక్కన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగన్ జన్మదినం సందర్భంగా బారీ కేకు ఏర్పాటు చేసి,కేకు కట్ చేసిన మదనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి,వైసీపీ మదనపల్లి నియోజక వర్గ పరిశీలకులు అనూష రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి వైసీపీ మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష),వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నియోజక వర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ,వైసీపీ నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్ష వర్ధన్ రెడ్డి(హర్ష) ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్, పాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం,యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగిందన్నారు.మదనపల్లిలో వాడవాడలా జగనన్న జన్మదిన వేడుకలు పేదల పాలిట పెన్నిధి వైయస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి,ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న నిస్సార్ అహ్మద్
Reporter
Namitha News