నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు విశాలాంధ్ర, మదనపల్లి: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు.
Reporter
Namitha News