నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన రాజంపేట టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. సుగవాసి ప్రసాద్ బాబు ను టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కోసువారిపల్లి పురవీధుల మీదుగా ఊరేగింపుగా శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి లు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించి సుగవాసి ప్రసాద్ బాబు ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు మదనపల్లి శ్రీరామ్ చినబాబు, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, తులసి ధర్నాయుడు,సిద్ధమ్మ, ఆదిరెడ్డి,తరుగు శివారెడ్డి,వెంకట్ రెడ్డి,సోమశేఖర్, పురుషోత్తం, వీరాంజనేయులు,నరసింహులు, హరికృష్ణ,కేశవరెడ్డి,శివరాం, జయరామిరెడ్డి,ఆనంద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News