Sunday, 26 July 2026 09:52:12 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు - అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 18 May 2026 04:09 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 18: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేసి ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని అదనపు ఎస్పీ గారు ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు మరియు మహిళల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వాటిని సైతం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అర్జీలుగానే పరిగణించి సకాలంలో పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి ఇద్దరు దివ్యాంగులు రాగా అదనపు ఎస్పీ గారు వారి వద్దకే వెళ్లి పిర్యాదులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. వారి ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని పీలేరు సిఐ గారిని, ములకలచెరువు సిఐ గారిని ఆదేశించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :