Monday, 27 July 2026 01:17:38 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎమ్మెల్యే ఆదేశాలను అధికారులు పాటించి తీరాల్సిందే

Date : 02 June 2026 04:12 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిరుద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 72 వేలు, ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన రూ.36 ఎప్పుడూ ఇస్తావు సిఎం చంద్రబాబునాయుడు ...?? ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు రెండేళ్ళగా దిక్కు లేదు... కూటమి పాలనపై నిస్సార్ అహమ్మద్ విమర్శలు -- రెండేళ్ళుగా ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం... చంద్రబాబునాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్ళు... జూన్ 4 నుంచి 12 వరకు YSRCP ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు.... పోస్టర్, బుక్ లెట్ విడుదల చేసిన మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ సీనియర్ నాయకులు N. శ్రీనాథ రెడ్డి సూపర్ సిక్స్ హామీలలో ఇచ్చిన ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ బృతి ఎప్పుడూ అమలు చేస్తారు..?? రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ఆడబిడ్డల నిధి రూ.36 వేలు, నిరుద్యోగ బృతి రూ‌.72 ఎప్పుడూ చెల్లిస్తారు సిఎం చంద్రబాబునాయుడు గారు అని మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రశ్నించారు. కూటమి రెండేళ్ళు పాలనపై YSRCP అదిష్టనం పిలుపు మేరకు చంద్రబాబునాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్ళు, జూన్ 4 నుంచి 12 వరకు చేపట్టే నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అవెన్యూ రోడ్డు లోని YSRCP కార్యాలయంలో నిర్వహించారు. ‌ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు N.శ్రీనాథ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మనుజా హాజరైనారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర పార్టీ ముద్రించిన చంద్రబాబునాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్ళు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 72 వేలు, ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన రూ.36 ఎప్పుడూ ఇస్తావు సిఎం చంద్రబాబునాయుడు గారు అని ప్రశ్నించారు. పధకాలు ఇవ్వడం అమలు చేయకుండా కాలం గడిపేయడం చంద్రబాబునాయుడుకు అలవాటే అని ఎద్దేవా చేశారు. ‌ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ బృతి అమలు చేసే ముందు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన పెండింగ్‌ నిధులు మంజూరు చేసి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని ఆరోపించారు. చంద్రబాబునాయుడు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 4 నుంచి 12 వరకు వివిధ రకాలుగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, రాజకీయ పార్టీలు హాజరై చంద్రబాబునాయుడు మోసాల్ని గ్రహించాలని కోరారు. 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో వివిధ రాజకీయ పార్టీలో మీటింగ్స్, 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు.‌ అదే రోజు ఇచ్చిన హామీల ప్రతులను మంటల్లో తగలబెడతాం అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్ తో ఫోన్లలో "వెన్నుపోటుకు రెండేళ్లు" బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని YSRCP ప్రభుత్వం రికార్డు స్థాయి సంక్షేమ పాలనను అందించిందని ప్రజలు మళ్ళీ, మళ్ళీ గుర్తుచేసుకునే విధంగా వుందని అన్నారు. DBT ద్వారా ప్రతి నెల సంక్షేమ పధకాల మొత్తం ప్రజల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి వేశారని, ప్రజల చేతులలో డబ్బు వుండి కొనుగోలు పెరిగి, వ్యాపార అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు అదంతా సున్నా అయిపోయిందని అన్నారు.‌ జగన్మోహన్ రెడ్డి నాడు, నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తే, కూటమి ప్రభుత్వం దాతల కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వం పాఠశాలల మరమ్మత్తులు చేయలేదని అన్నారు.‌ ఇంగ్లీషు మీడియం ఎత్తివేసిందని అన్నారు. రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్ట పరిహారం చెల్లించడం ద్వారా ఆదుకోవడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ సక్రమంగా అమలు కాలేదని అన్నారు. ‌డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పలురకాల ఇబ్బందులు పెడుతుందని అన్నారు. తల్లికి వందనం రూ.15 వేలు అని ప్రగల్భాలు పలికి చివరికి ఎంత ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.‌ మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిందని ఎద్దేవా చేశారు. ‌చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చింది లేదు.. కానీ తీసేసిన పెన్షన్లు సుమారు 6 లక్షలు పైగా ఉన్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పించను ఏమైందని ప్రశ్నించారు. ఎందుకు పెన్షన్ తీసేశారని ప్రశ్నిస్తే కారణాలు చెప్పలేక బుకాయిస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, డిఎస్సీ అవినీతి మయం అయిందని, ఇంక పెద్ద పదవి ఇస్తే ఇంకేం చేస్తారో అని అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ‌ఈ కార్యక్రమంలో ఎస్. రమేష్, ఈశ్వర్ రెడ్డి, ఇర్ఫాన్ షేక్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, సుధాకర్, చరణ్, ఈశ్వర్ నాయక్, ఎన్. ఇర్ఫాన్ ఖాన్, చంద్ర శేఖర్, శారదా రెడ్డి, నాయకులు నాగరాజ్ రెడ్డి, ఖాదర్, పవన్ పెద్ద సంఖ్యలో YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: