నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : *ఇంటర్మీడియట్ (క్లాస్ XII) బోర్డు పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించిన విశ్వం స్కూల్ సీబీఎస్సీ* మదనపల్లిలోని విశ్వం స్కూల్ CBSE, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాస్ XII CBSE బోర్డు పరీక్షల్లో వరుసగా రెండోసారి 100% ఫలితాలను సాధించి విశేష విజయాన్ని నమోదు చేసింది. పరీక్షలకు హాజరైన మొత్తం 83 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి, పాఠశాల విద్యా ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలో నిర్వహించిన రెగ్యులర్ టెస్టులు, స్టడీ అవర్స్, రిమీడియల్ క్లాసులు, మరియు మోటివేషనల్ సెషన్స్ తమ విజయానికి ప్రధాన కారణమని తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పేర్కొన్నారు. ఫలితాల సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకోవడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విశ్వం స్కూల్ CBSE గత కొన్ని సంవత్సరాలుగా అద్భుత ఫలితాలను సాధిస్తూ వస్తోంది. ఈ ఏడాది 92% అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం ద్వారా చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లా,మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ CBSE పాఠశాలల్లో మేటిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 92% మార్కులతో ప్రథమ స్థానం సాధించిన పర్ణికరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సబ్జెక్ట్ వారీగా అత్యధిక మార్కులు: ఇంగ్లీష్ – 96 మ్యాథమెటిక్స్ – 94 ఫిజిక్స్ – 80 కెమిస్ట్రీ – 98 బయాలజీ – 98 ఇన్ఫర్మాటిక్స్ – 98 ఈ ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ డా. జే. రోజ్లిన్ ప్రియా మాట్లాడుతూ, “ఈ 100% ఫలితం మా విద్యార్థుల అహర్నిశల శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల నిరంతర సహకారానికి ప్రతిబింబం. విశ్వంలో మేము సమగ్ర ప్రతిభను విశ్వసిస్తాము. నేటి విజయం దానికి నిదర్శనం” అని తెలిపారు. చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు విద్యార్థులు మరియు సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా కాన్సెప్ట్ ఆధారిత బోధన మరియు వ్యక్తిగత మార్గదర్శకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విజయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
Reporter
Namitha News