నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 01: మదనపల్లె : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఓసూరి కిరణ్ కుమార్ ను జనసేన పార్టీ సినియర్ నాయకులు తోట కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. సోమవారం మదనపల్లె స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఓసూరి కిరణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట కళ్యాణ్ మాట్లాడుతూ...పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేందుకు ఓసూరి కిరణ్ కుమార్ ప్రత్యక్ష సాక్షి అన్నారు. పార్టీ ఆయన సేవలను గుర్తించి పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడపా సురేందర్, జనసేన ఐటి విభాగం లక్ష్మీనారాయణ, రామ్మోహన్, అప్రోజ తానేశ్వర్, గిరి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News