Monday, 27 July 2026 03:12:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశ్వం ఇంజనీరింగ్ కాలేజీలో రీజనింగ్ & ఆప్టిట్యూడ్ ప్రజెంటేషన్ వర్క్‌షాప్

Date : 06 February 2026 02:28 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కాలేజీలో రీజనింగ్ & ఆప్టిట్యూడ్ ప్రజెంటేషన్ వర్క్‌షాప్ ఉద్యోగ ఎంపికకు అవసరమైన తార్కిక ఆలోచనా శక్తి, ప్రజెంటేషన్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన. అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల (ఆటోనమస్) లో బుధవారం రీజనింగ్ & ఆప్టిట్యూడ్ ప్రజెంటేషన్ పై ఫైవ్ వర్క్‌షాప్ ను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డా. జి. ఎల్. మీనా మాట్లాడుతూ, ఉద్యోగ ఎంపికలో కీలకమైన గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ టిప్స్ మరియు మెథడాలజీ పై విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. డీన్ డా. బి. శంకర్ నాయక్ మాట్లాడుతూ, రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ ప్రజెంటేషన్ నైపుణ్యాలు కార్పొరేట్ జాబ్ సెలక్షన్‌లో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంబీఏ ప్రొఫెసర్ డా. ఎం. రెడ్డి రాము విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజెంటేషన్ మెథడ్స్, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్ ప్లాన్స్, మాక్ ఇంటర్వ్యూలు పై రోజూ సాధన చేయాలని సూచించారు. అలాగే వర్బల్ & నాన్-వర్బల్ రీజనింగ్, కోడింగ్–డీకోడింగ్, అనాలజీ, క్యాలెండర్, డేటా అనాలిసిస్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్ అంశాల్లో షార్ట్‌కట్ టిప్స్ వివరించారు. ఈ వర్క్‌షాప్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ, రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయని, డిగ్రీతో పాటు పీజీ విద్యార్థులు ఉత్తమ ప్యాకేజీ ఉద్యోగాలు సాధించాలంటే కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా, డీన్ డా. బి. శంకర్ నాయక్, విభాగాధిపతి డా. జి. ఎల్. మీనా, అధ్యాపకులు మరియు ఎంబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :