నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 16 : రామసముద్రం మండలం చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సినేటర్లకు పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో 1525 మంది 5 సంవత్సరాలు లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్యాధికారులు జాహ్నవి, నాగరాజులు తెలిపారు. ఈ నెల 21 వ తేదీ జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి టి.వి రమణ , ఎ.ఎన్.ఎం లు , సి హెచ్ ఓ లు , ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు
Admin
Namitha News