నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు : ప్రపంచ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని పుంగనూరు పట్టణం లోని భాష్యం పాఠశాలలో ఆదివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగా శిక్షకులైన వనిత ఆధ్వర్యంలో యోగా ఆసనాలు నిర్వహించారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంపొందిస్తుందని, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని యోగా శిక్షకులు వనిత తెలిపారు.
Reporter
Namitha News