నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : కూటమి ప్రభుత్వంలో మంజూరయిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం భావ్యం కాదని తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కోరారు. శుక్రవారం పంచాలమర్రి లో మంజూరైన మినీ పంచాయతీ భవన నిర్మాణ స్థల వివాదంపై ఆయన ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. భవన నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం ప్రభుత్వందని అందులో నిర్మాణం చేపడుతుంటే కొందరు అడ్డుపడడం పై రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు ఇదివరకే విచారణ చేసి అది ప్రభుత్వ స్థలంగా గుర్తించారు. అయితే కొందరు అక్కడ ఆక్రమణకు పాల్పడిన విషయం తెలుసుకున్న సాయినాథ్ ఇరు వర్గాలతో చర్చించి పంచాయతీ అభివృద్ధి కోసం నిర్మిస్తున్న భవనాన్ని అడ్డుకోరాదని రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారుల సూచన మేరకు నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ ను సన్మానించి తంబళ్లపల్లె మండలంలో శాంతి భద్రతల పరిరక్షణపై సహకరించాలని సూచించారు.ఆయన వెంట మండల జనసేన రథసారథి ఎద్దుల నరసింహులు, సిద్ధమల్ రెడ్డి,మురళీకృష్ణ, టిడిపి నాయకులు ఆనంద్ రెడ్డి, రాఘవరెడ్డి, రామచంద్ర, బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News