Monday, 27 July 2026 12:07:20 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గ్రామ సచివాలయ సేవలు పారదర్శకంగా, వేగంగా అందాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 April 2026 08:13 PM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 02: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విధానం, ప్రజల వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. హాజరు వ్యవస్థ కచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను, అలాగే జిల్లా కేంద్రం నుండి పంపబడే వినతులు, వివిధ శాఖల సూచనలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామస్థుల సమస్యలను ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను కూడా పరిశీలించిన కలెక్టర్, అన్ని రికార్డులను సక్రమంగా నవీకరించి నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయడం ద్వారా భూ వివాదాలు తగ్గి ప్రజలకు సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలో అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో తాసిల్దారు ధనుంజయులు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :