Sunday, 26 July 2026 10:07:50 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బోయకొండ లో మహిళల రక్షణ పై శక్తి టీం అవగాహన సదస్సు

Date : 22 April 2026 11:47 AM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఏప్రిల్ 22 : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు బుధవారం బోయకొండ వద్ద అన్నమయ్య జిల్లా శక్తి టీం తో మహిళల భద్రత పై మహిళలకు నందు అవగాహన కార్యక్రమం నిర్వహించిన చౌడేపల్లి పోలీసులు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి యస్.ఐ. చిన్న రెడ్డప్ప ఆధ్వర్యంలో ప్రజలకు విలువైన సూచనలు అందించి, మహిళలకు అవగాహన కల్పించారు

అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఎదురయ్యే ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేస్ స్టడీస్, POCSO చట్టం పై పూర్తి వివరణ, చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి ఎలా పెంపొందించుకోవచ్చో మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయకుండా బాధ్యతగా ఉండడం, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించడం, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల పిల్లల జీవితాలకు కలిగే దుష్ప్రభావాలు అంతేకాకుండా, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నెంబర్లు 1930, 112, 1098 గురించి కూడా స్థానిక మహిళలకు, విద్యార్థులకు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

శక్తి టీం, మునికుమార్ నాయక్, శశికళ మణికంఠ, వీణ కుమారి పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :