Saturday, 25 July 2026 11:26:58 PM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పల్లె బాట తోనే విద్యుత్ సమస్యల పరిష్కారం - డి.ఈ గంగాధరం

Date : 18 July 2026 09:33 AM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 : మారుమూల గ్రామాలలోని విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయి పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమం దోహదపడుతుందని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శుక్రవారం ఆయన ఎ.డి గోవిందరెడ్డి,ఏ.ఈ సురేంద్రతో కలిసి కోటకొండ పంచాయతీలో విద్యుత్ సిబ్బంది మూకుమ్మడిగా పల్లె బాట కార్యక్రమం కొనసాగించారు. పంచాయతీలోని గ్రామాలతోబాటు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్లు క్లియరెన్స్ తో పాటు రైతుల పొలాల వద్ద సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి వినియోగదారుడు సోలార్ విద్యుత్తు పై దృష్టి సారించి విద్యుత్ బిల్లులు చెల్లించే పని లేకుండా ఆదాయం పొందవచ్చునని హితవు పలికారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లింపులు వల్ల కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరుపై డిఇ వినియోగదారులను, రైతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :