నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 28 : పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం కు చెందిన న్యాయవాది శైలేంద్ర కుమార్ డాక్టరేట్ సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. న్యాయవాది వృత్తిలో నిజాయితీ, నిబద్ధతతో సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చురుకుగా స్పందిస్తున్న శైలేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు చట్టం 2023కు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిరసనలు నిర్వహించి ప్రజా హక్కుల పరిరక్షణలో ముందుండి పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా విధులు నిర్వర్తిస్తూ సమాజంలో విశ్వసనీయతను సంపాదించారు. ఆయన న్యాయ సేవలు, సామాజిక బాధ్యత, వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తించిన బెంగళూరులోని ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ శైలేంద్ర కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, మిత్రులు, ప్రజలు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని వారు తెలియజేశారు.
Reporter
Namitha News