Monday, 27 July 2026 01:52:33 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 24 December 2025 10:33 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 24 : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ క్రిస్మస్‌ పండుగ శాంతి, సంతోషం, త్యాగం మరియు కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. లోక రక్షకుడైన యేసు క్రీస్తు జన్మదినాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం మరియు త్యాగం వంటివి క్రీస్తు మానవాళికి అందించిన మహోన్నత సందేశాలని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలుగుతూ, ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు బోధనలు సమాజంలో శాంతియుత జీవనానికి మార్గదర్శకాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :