Sunday, 26 July 2026 09:57:38 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అట్టహాసంగా టిడిపి రాజంపేట పార్లమెంట్ కార్యవర్గం పదవీప్రమాణ స్వీకారం

అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు

Date : 02 March 2026 09:10 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 02 : రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ నూతన కార్యవర్గం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మదనపల్లి పట్టణం లోని రామ తులసి కన్వెన్షన్ నందు సోమవారం అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు గారితో పాటు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల నుండీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం తో పట్టణం పసుపు సైనికులతో నిండిపోయింది. కార్యవర్గం ప్రమాణం స్వీకారం కార్యక్రమం కు ​ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, టిడిపి ఇన్చార్జిలు రూపానంద రెడ్డి, జగన్మోహన్ రాజు, చల్లా బాబు, కార్పొరేషన్ ఛైర్మెన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయి నాయకులు, టిడిపి సీనియర్ మహిళలు, తదితరులు పాల్గొనికార్యకర్తల నిద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. "నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయకర్తగా ఉంటూ, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమన్వయంతో కలిసి పనిచేస్తామని తెలిపారు, 2029 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడమే మా లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :