Monday, 27 July 2026 12:49:14 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గంజాయి ముఠా ఆటకట్టించిన పోలీసులు -

పొలంలో సాగు..బి.కొత్తకోటలో విక్రయం

Date : 03 February 2026 02:52 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గంజాయి ముఠా ఆటకట్టించిన పోలీసులు - పొలంలో సాగు..బి.కొత్తకోటలో విక్రయం - వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : అన్నమయ్య జిల్లాలో గంజాయి సాగు చేస్తూ,విక్రయిస్తున్న ఒక భారీ ముఠా ఆటకట్టించారు పోలీసులు.మంగళవారం మదనపల్లి డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పీటీఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి తన పొలంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నాడు.ఆ పంటను డబ్బు ఆశ చూపి సురేంద్ర,అఫ్రీద్,పురుషోత్తం,ఆదిల్ అనే యువకుల ద్వారా మార్కెట్లోకి తరలిస్తున్నాడు.సమాచారం అందుకున్న బి.కొత్తకోట పోలీసులు నిఘా ఉంచి,ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడుగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎన్.డి.పీఎస్ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేసి మత్తుపదార్థాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.సాగు చేసినా,అమ్మినా జైలు శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు.ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన మదనపల్లి డిఎస్పీ మహేంద్ర,బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి,క్రైమ్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :