Monday, 27 July 2026 10:53:54 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రూమాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో యం.ఓ.యు. కుదుర్చుకొన్న మిట్స్

Date : 21 February 2026 05:01 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 21 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం వారు బెంగళూరుకు చెందిన రూమాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రూమాన్ టెక్నాలజీస్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి మరియు సీనియర్ టెక్నికల్ మేనేజర్ వెంకట్ బి. రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అవకాశాలను విస్తరించుకోవచ్చని అన్నారు. తమ సంస్థ కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల ద్వారా పలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఆ ప్రాజెక్టుల అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించి ఆధునిక సాంకేతిక రంగాల్లో వారి నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఉపాధి హామీ కల్పించే విధంగా ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందిస్తామని, విద్య పూర్తయ్యే సమయానికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఇంటర్న్‌షిప్‌లు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు మరియు ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్త్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్ -స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :