నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు సోమల మండలం నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం కుసుమాంబ శనివారం తెలిపారు. ఈనెల 19న నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనకు మూడు నమూనాలు పంపగా ఒక నమూనా రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. గైడ్ టీచర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో విద్యార్థులు గోవర్ధన్, పేర్నిష్ రూపొందించిన ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ప్లడ్ వాటర్, స్మార్ట్ పైప్స్ అంశం ఎంపికైనట్లు తెలిపారు.
Admin
Namitha News