Sunday, 26 July 2026 09:04:50 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ యువజన నాయకులకు ఘన సన్మానం.

యువతే తోనే దేశ భవిష్యత్తు, కాంగ్రెస్ లో యువతకే ప్రధాన్యత అంటున్న రెడ్డిసాహెబ్

Date : 24 June 2026 04:54 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మన దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని, యువత సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ ఆకాంక్షించారు. నూతనంగా యువజన విభాగం ను పటిష్టం చేసే క్రమంలో నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సి.రెడ్డీ చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్. గుల్షన్ ఎన్నికైన సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్, మీనా కుమారి, బండపల్లి ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన యువజన రాష్ట్ర కార్యదర్శి సి.రెడ్డీ చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్. గుల్షన్ లను దుశ్శాలువతో సన్మానించి, పూలబోకేలు అందించి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ యువత తోనే దేశ భవిష్యత్తు వుంటుందని పేర్కొన్నారు. ‌కాంగ్రెస్ పార్టీలో మాత్రమే యువజన విభాగం ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. ‌ఇందులో భాగంగా నిర్వహించిన ఓటింగ్ లో రాష్ట్ర కార్యదర్శి సి.రెడ్డీ చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్. గుల్షన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల మద్దతు, పనితీరు ఆధారంగా ఎన్నిక కావడం సర్వత్రా అభినందనీయం అన్నారు.‌ గ్రామ స్దాయి నుంచి యువతను చైతన్య పరచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ‌ముఖ్యంగా సర్ పైన అపోహలు లేకుండా, ప్రజలను చైతన్య పరచి ప్రతి ఓటరు తమ ఓటు హక్కు పొందడానికి అవకాశం కల్పించే విధంగా పని చేయాలని సూచించారు. ‌అనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి సి.రెడ్డీ చైతన్య, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బి. శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్. గుల్షన్ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ‌వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తామని ప్రకటించారు. సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పైన ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. తమమకు అప్పగించిన భాద్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రదానమంత్రి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రకటించారు. ‌ఈ కార్యక్రమలో సీనియర్ నాయకురాలు మీనా కుమారి, నాయకులు బండపల్లి ఈశ్వరయ్య, పాలేటి, నాగరాజు, మహమ్మద్ అలీ, జీవన్, హబీబ్, రఫీ, ఆర్.జగదీష్, సోహెల్, సాధిక్, తాహీర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :