నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 07 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారు అమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ (ASCE) మిట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "సీటా - 2K26" ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె కు చెందిన ఆరన్ సైంటిఫిక్ కంపెనీ, సి ఈ ఓ డాక్టర్ నంద కిషోర్ నాయిని పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ప్రముఖ ఇంజినీర్ అయిన సర్ మోక్షగుండం విస్వేస్వరయ్య దేశ అభివృద్ధిలో చేసిన విశేష సేవలను కొనియాడారు. ప్రకృతి నుండి ప్రేరణ పొందుతూ ఇంజినీరింగ్‌లో కొత్త పరిష్కారాలను ఎలా రూపొందించవచ్చో వివరించారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీరింగ్ రంగంలో రాబోయే సాంకేతిక ఆవిష్కరణల గురించి మాట్లాడుతూ స్వయంగా పగుళ్లు నయం చేసుకునే కాంక్రీట్ మరియు భవనాల్లో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ వినియోగం తక్కువగా ఉండి, పర్యావరణానికి హాని చేయని, శక్తిని ఆదా చేసే విధంగా పనిచేసే ఎయిర్ కండిషనింగ్ పద్ధతుల వంటి సాంకేతికతలు భవిష్యత్తు నిర్మాణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక – ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం కు దేశ నలుమూలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్సపో, ఆటో క్యాడ్ డ్రాయింగ్ మరియు వెబ్ డిజైనింగ్ ఈవెంట్ లలో పాల్గొనడానికి వచ్చారని అని అన్నారు. కార్యక్రమంలోప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయ కుమార్ నటేశన్, కోఆర్డినేటర్ డాక్టర్ ఇమ్రాన్ కుటాగుళ్ల, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News