నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూకా సిటిఎం గ్రామంలో వెలసిన శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతర సందర్భంగా గురువారం మదనపల్లె తాలూకా సీఐ కళ వెంకటరమణ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆనంద పార్థసారథి, మండల ఎంపీపీ భర్త వెలుగు చంద్రతో పాటు ఆలయ కమిటీ పెద్దలు సీఐ కళ వెంకటరమణ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జాతర నిర్వహణలో పోలీస్ శాఖ అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. భక్తుల రద్దీ మధ్య జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News