Sunday, 26 July 2026 09:52:11 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె అభివృద్ధికి విజన్ 2047 భవిష్యత్ ప్రణాళిక - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 30 March 2026 08:46 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 30 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 విజన్ భవిష్యత్తు ప్రణాళికలతో ముందడుగు వేయడానికి సహకరించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో 2017 విజన్ మరియు పి4 పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అభివృద్ధి పనుల ప్రణాళికలను అధికారులు గుర్తించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. మండలాల వారిగా ఏడాదిగా పి4 కార్యక్రమం ద్వారా చేపట్టిన అంశాలపై చర్చించారు. పి 4 కార్యక్రమంలో పేదరిక నిర్మూలనలో భాగంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మార్గదర్శకులను గుర్తించాలన్నారు. వారిని గుర్తించి భవిష్యత్తులో పేదరికం రూపుమాపడానికి సహకరించాలన్నారు. 20 47 విజన్ లో భాగంగా మండలాలలో అన్ని శాఖల అధికారులు తాగునీరు, సాగునీరు, రోడ్లు, వ్యవసాయం, ఉపాధి, ఐకెపి, హౌసింగ్, పశుసంవర్ధక శాఖ, శిశు సంక్షేమం, హార్టికల్చర్, సిరికల్చర్, విద్యుత్, సూర్య ఘర్, మౌలిక సదుపాయాల కల్పన తోపాటు పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. అనంతరం కురబలకోట మండలానికి చెందిన పి4లో 129 కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులు కాకర్ల సుధీర్, శెట్టి సీతారాం, గుర్రాల మనోజ్ కుమార్ లను ప్రభుత్వం తరఫున స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,పశుసంవర్ధక శాఖ ఏడి సుమిత్ర, పంచాయతీ రాజ్ డి ఈ మునిరాజ్, సిడిపిఓ సుజాత,ఏపీఎం గంగాధర్, 20 47 విజన్ అధికారి రెడ్డప్ప, సభ్యులు,ఆరు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏఈ లు, అధికారులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్రలు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :