Sunday, 26 July 2026 01:41:11 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు సహించేది లేదు - టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

Date : 31 December 2025 06:31 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని అలాంటిది పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె మండల కేంద్రం అంబేద్కర్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి సారథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు విశాఖలో సాఫ్ట్వేర్ రంగం లో దూసుకుపోతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు తోపాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. పార్టీ పదవులు ఊరికే రావని పార్టీ కోసం కష్టపడి త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే సహించనని ఏ కార్యక్రమం జరిగిన ఏకతాటిపై జరగాలని సూచించారు. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీకి కంచుకోటని అలాంటిది మనలో గ్రూపు రాజకీయాలు చేస్తే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదని హెచ్చరించారు. నాయకులు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానని ఐకమత్యంతో టిడిపి కుటుంబ సభ్యులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, ములకలచెరువు సింగల్ విండో ప్రెసిడెంట్ త్యాగరాజు,రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్,బిసి నాయకుడు పురుషోత్తం, క్లస్టర్ ఇన్చార్జి బేరి శ్రీనివాసులు,రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, సోమశేఖర్,తెలుగు యువత నరసింహులు, వీరాంజనేయులు, కాలా నారాయణ, ఎస్టీ నాయకుడు వెంకటరమణ, రామచంద్ర , ఆనంద్ రెడ్డి , కందిమడుగు సోమశేఖర్ ,సురేంద్ర , మండలములోని వందలాది గా టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: