నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల కోసం “అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE)” పై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యా నాణ్యతను పెంపొందించడంలో ఎన్.బి.ఏ మరియు న్యాక్ గుర్తింపు ఎంతో కీలకమని, ఎన్.బి.ఏ ప్రధానంగా టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు అక్క్రిడిటేషన్ ఇస్తూ, కోర్సులు అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్నాయా అనే అంశంపై దృష్టి పెడుతుంది అని అన్నారు. న్యాక్ గుర్తింపు మాత్రం మొత్తం సంస్థ పనితీరును అంచనా వేసి, పాఠ్య ప్రణాళిక, బోధన-అభ్యాసం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అంశాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వడం ద్వారా అక్క్రిడిటేషన్ పొందిన కళాశాలలకు పరిశ్రమలతో అనుబంధం పెరగడం, ఉద్యోగావకాశాలు మెరుగు పడడం, ప్రభుత్వ నిధులు పొందే అవకాశం పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియడం ద్వారా బోధనా నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల నేర్పుదల పద్ధతులు, కోర్స్ అవుట్‌కమ్, ప్రోగ్రామ్ అవుట్‌కమ్ రూపకల్పన, అకడమిక్ అక్వాలిటీ మెరుగుదల వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల నుండి 80 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News