నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వ తాతల భోజన నిమిత్తం చౌడేపల్లి వాస్తవ్యులు ఎంపీడీవో లీలా మాధవి వారి తల్లిగారు శాంత కుమారి పేరు మీద ఆనందంలోని వృద్ధులకు భోజనం చేయుటకు వీలుగా పదివేల రూపాయలు విలువ చేసే ఐదు భోజనం టేబుల్ ను వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు... ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితా రాణి మాట్లాడుతూ ఎంపీడీవో లీలా మాధవి గారు గత కొన్ని సంవత్సరాలుగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వివిధ రకాలుగా నిత్యవసర వస్తువులు సహకరిస్తూ వస్తున్నారు... ప్రస్తుతం వృద్ధులు బికేపల్లి వైయస్సార్ కాలనీ నందు మధ్య భవనంలో మార్చడం జరిగింది వారికి వీలుగా భోజనం చేయుటకు అనువుగా భోజనం టేబుల్ కావాలని ఎంపీడీవో లీలా మాధవి మేడం కి తెలపడంతో వెంటనే తన తల్లిగారు శాంతకుమారి పేరు మీద పదివేల రూపాయలు విలువ చేసే భోజనం టేబుల్ అందించారు ఈ సందర్భంగా లీలా మాధవి మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం
Reporter
Namitha News